కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ పేరుతో దగా చేశారని మండిపడ్డారు. ఒక్క రైతుకు అయినా రుణమాఫీ జరిగినట్టు చెబితే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రైతులను మోసం చేసిన రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలన్నారు. దేశంలోనే ఇది అతిపెద్ద మోసమని… ఒకే సంతకంతో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారని.. రైతులను రేవంత్ అడ్డంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.