హైదరాబాద్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలిక ఇందు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. తల నొప్పి, కడుపునొప్పి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబీకులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. అయితే,.. బాలిక ఇది వరకు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఘటనలో తీవ్రంగా గాయపడింది.