34.2 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

CM KCR: ఉద్యోగులకు శుభవార్త.. త్వరలోనే పీఆర్సీ కమిషన్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే వేతన సవరణ కమిషన్(PRC)తో పాటు మధ్యంతర భృతిని కూడా ఇస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసీ ఛైర్మన్ రాజేందర్, ప్రధాన కార్యదర్శి మమత, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గురువారం సీఎం కేసీఆర్ ను కలిశారు. ఉద్యోఘా సంఘాల నేతల మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సీఎం కలిశారు. ఈ సందర్భం ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఉద్యోగులకు రెండో పీఆర్సి ని  ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల చందాతో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈట్రస్ట్ ద్వారా వైద్యసేవాలు అందేలా చూడాలన్నారు. కేంద్ర తీసుకొచ్చిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగ సమస్యల పరిష్కరిస్తామని చెప్పారు.ఉద్యోగులు, పింఛనుదారులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రెండు రోజుల్లో పీఆర్సీ, మధ్యంతర భృతిని ప్రకటిస్తామనికేసీఆర్ చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

సీఎం కేసీఆర్ కలిసిన అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాటారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లన్నట్లు చెప్పారు. పీఆర్సీ, మధ్యంతరభృతిపై సీఎం కేసీఆర్ ప్రకటనే చేసే అవకాశం ఉందని టీఎన్టీవోల సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పీఆర్‌సీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కాగా తాజాగా హైదరాబాద్ లో భూములు ధరలు భారీగా పలికాయి. ప్రభుత్వ వేలంలో ఎకర భూమి రూ.100 కోట్లు పలికింది. దీనిపై సీఎం కేసీఆర్ స్పదించారు. ఇది తెలంగాణ సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతుందని చెప్పారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్