నేడు ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

   సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కు తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రచారరంగంలోకి దూకుతు న్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం రాష్ట్రవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇవాళ చంద్ర బాబు ప్రజాగళం పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటి స్తారు. ఉదయం కుప్పం నుంచి పలమనేరు చేరుకుని అక్కడ ప్రజాగళం తొలి బహిరంగసభలో పాల్గొం టారు. తర్వాత నగరి నియోజకవర్గం పుత్తూరు, అన్నమయ్య జిల్లా మదనపల్లె సభల్లోనూ మాట్లా డతారు.

    ప్రజాగళం పేరిట పలమనేరు, పుత్తూరులో ప్రచార సభలు నిర్వహించనున్నారు. పలమనేరులో ఉదయం 11 గంటల నుంచి 12 .30 గంటల వరకు జరిగే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. 2.30 గంటల నుంచి 4 గంటల వరకు నగరి నియోజకవర్గం పరిధిలోని పుత్తూరులో జరిగే ప్రజాగళం కార్య క్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల వరకు మదనపల్లెలో జరిగే ప్రజాగళం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రికి మదనపల్లిలో బస చేస్తారు. రాత్రి కుప్పంలో బస చేసిన చంద్రబాబు ఇవాళ నేరుగా పలమనేరుకు చేరుకొని ప్రజాగళం కార్యక్రమాన్ని ప్రారంభించ నున్నారు. ఈ కార్యక్రమానికి ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారు. అనంతరం అన్న మయ్య జిల్లా మదనపల్లెకు హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లనున్నారు.

Latest Articles

క్రిష్ ప్రయోగం ఫలించేనా..?

మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్