ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఒకే వేదికపై కనిపించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. పల్నాడు జిల్లాలో పర్యటించనున్న వీరిద్దరూ.. నరసరావుపేట మండలం కాకాని జేఎన్‌టీయూ కశాళాలలో నిర్వహిస్తోన్న వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ వేర్వేరు హెలిక్యాప్టర్లలో జేఎన్‌టీయూకు చేరుకోనున్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటనున్నారు. అనంతరం JNTU కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వీరిద్దరి టూర్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. వనం – మనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.