వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. కుమార్తె పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు అనుమతి కోరగా అందుకు అంగీకరించింది న్యాయస్థానం. అయితే,.. యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబరు, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సెప్టెంబర్ 3 నుంచి 25 వరకూ విదేశీ పర్యటనలో ఉండనున్నారు జగన్.