కుల గణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని దోభిఘాట్ గ్రౌండ్‌ను ఆయన పరిశీలించారు. ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. దోభిఘాట్ గ్రౌండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కులగణన సర్వేలో బ్యాంకు ఖాతా వివరాలు అడగట్లేదని స్పష్టం చేశారు. కులం వివరాలు చెప్పడం ఇష్టం లేకుంటే 999 ఆప్షన్ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 30 శాతం కులగణన సర్వే పూర్తయిందని తెలిపారు. సర్వేలో ఎలాంటి అపోహలు వద్దన్నారు. రాజకీయ కుట్ర చేసేవారే వీటిని సృష్టిస్తున్నారని చెప్పారు. కులగణన సర్వే వల్ల కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టవచ్చని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కులగణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదు – మంత్రి పొన్నం
0
241
Previous article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


