ఆధునిక.. సంప్రదాయ మేళవింపు కలగలిపిన సూత్ర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ప్రదర్శనను వారాహి సిల్క్స్ ఎండీ డాక్టర్ స్పందన మద్దుల, టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ హిమజ శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్పందన మద్దుల, హిమజ లు మాట్లాడుతూ.. దేశంలోని అనేక నగరాల మహిళా వ్యాపారవేత్తలు, డిజైనర్లు ఒకే వేదికలో విభిన్నమైన వస్త్ర, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ నెల 17 వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో వెడ్డింగ్ సీజన్ షాపింగ్ అనుభూీతిని కలిగించే ప్రత్యేకమైన ఫ్యాషన్, వెడ్డింగ్ ప్రత్యేక సేకరణలు, భారతీయ దుస్తులు, డిజైనర్ , వెస్ట్రన్ వేర్, ఇండియన్ అప్పారెల్, హ్యాండ్లూమ్స్, కాస్ట్యూమ్ & డిజైనర్ జ్యువెలరీ తో పాటు గృహోపకరణాెలు, పాదరక్షలు వంటి వేలాది రకాల ఉత్పత్తులను ఈ స్పెషల్ ఎడిషన్ లో 70 స్టాల్ల్స్ 50 వేల రకాలకు పైగా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నామని సూత్ర నిర్వాహకులు ఉమేష్ తెలిపారు. నగర సోషలైట్స్ తో పాటు వర్ధమాన నటులు శశికళ టికూ, మహి తదితరులు కూడా హాజరయ్యారు.