తెలంగాణలో రైతు రుణమాఫీ మంటలు చల్లారడం లేదు. ఇచ్చిన హామీలను నిలదీస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చెబుతున్న బీఆర్‌ఎస్.. ఎన్నికల హామీలపై గట్టిగా నిలదీస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీపై పోరుబాట పట్టింది. ఇవాళ రంగారెడ్డి జిల్లా కందుకూరు ధర్నాకు సిద్ధమైంది. రుణమాఫీపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చింది. కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు పార్టీ అగ్రనేతలు పాల్గొననున్నారు.


