రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. రాహుల్‌పైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు.

తుక్కుగూడ సభలో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా దురుద్దేశపూర్వకంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహా రాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీపై ముఖ్యంగా, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయం లో కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ అబద్ధాలు, అసత్యాలను మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించింది. రాహుల్ వ్యాఖ్యల వీడియోలను ఫిర్యాదుకు జతపరిచిన బీఆర్ఎస్.. తక్షణమే రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించింది. ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో అడ్డగోలుగా మాట్లాడారంటూ మంత్రి కొండా సురేఖపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్‌, దాసోజు శ్రవణ్‌ ఫిర్యాదు చేశారు.

Latest Articles

బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ

పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్