కేజ్రీవాల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్న ఢిల్లీ హైకోర్టు

  ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌ ను ఈడీ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువడనుంది. జస్టిస్‌ స్వర్ణ కాంత్‌ శర్మ ఈ కేసును విచారించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం రెండున్నరకు తీర్పు వెలువడే అవకాశం ఉంది. అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌, ఈడీ పిటిషన్‌పై ఇప్పటికే కోర్టు విచారణ చేసింది. ఈడీ , కేజ్రీవాల్‌ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. జస్టిస్‌ స్వర్ణకాంత్‌ శర్మ తీర్పును రిజర్వ్‌ చేశారు.

   కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో అరెస్టు చేసేందుకు సాక్షుల నుంచి బలవంతంగా వాంగ్మూలాలు రికార్డు చేశారని.. తన అరెస్టు చట్టవిరుద్దమని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. కేజ్రీవాల్ తన అరెస్టును కుట్రగా అభివర్ణించారు. సాక్షుల వాంగ్మూలాలను ఆయన ప్రశ్నించారు. సాక్షులు తన పేరు చెప్పే వరకు వాంగ్మూలాలు తీసుకుంటుందని .. ఒకసారి తన పేరు చెప్పగానే అరెస్టు చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తనను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. 2022 నాటి కేసు అక్టోబర్‌ సమయంలో నోటీసులు ఇచ్చారని.. ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్టు చేశారని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్