ఉమ్మడి ప్రచారంతో కూటమి ఎన్నికల రణభేరి

    ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. మే13న ఎన్నికల కురుక్షేత్రం జరగనుంది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రజల బాట పట్టాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పోలింగ్‌కు టైం దగ్గర పడుతుండడంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు..ఎన్నికలు దగ్గరపడుతుండడంతో వ్యూహం మార్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు.

   టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత..గత నెల 17న చిలకలూరిపేటలో తొలి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు మూడు పార్టీల అగ్రనేతలు ప్రధాని మోదీ, చంద్రబాబ, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి బహిరంగసభలో పాల్గొన లేదు. చంద్రబాబు ప్రజాగళం పేరుతో 25 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. అటు వారాహి విజయ యాత్ర తో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుం డటంతో కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రేపు, ఎల్లుండి జరిగే మూడో విడత ప్రజాగళంలో చంద్రబాబు- పవన్‌ కలిసి పాల్గొననున్నారు.

   ఈ నెల 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం చేస్తారు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నారు. ఇప్పటివరకు విడివిడిగా ప్రచారం చేసిన ఇద్దరు అగ్రనేతలు..ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటి కల్ హీట్ వేడెక్కనుంది. అంతేకాకుండా చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించనుంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్