21.7 C
Hyderabad
Saturday, February 8, 2025
spot_img

‘ఘోస్ట్’ నుండి బ్లాస్టింగ్ ‘బిగ్ డాడీ’ టీజర్ విడుదల

స్వతంత్ర వెబ్ డెస్క్: కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ తన తాజా చిత్రం, హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఘోస్ట్ తో ప్యాన్ ఇండియా బరిలో దిగనున్నారు. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ప్రచార చిత్రం అంచనాలు పెంచే విధంగానే ఉండటం సినిమా ఏ స్థాయిలో తెరకెక్కిందో తెలియజేస్తోంది. మేకర్స్ ఘోస్ట్ నుండి బిగ్ డాడీ టీజర్ ను డా. శివరాజ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని జూలై 12 న విడుదల చేశారు.

టీజర్ ఒక పాడుబడిన బిల్డింగ్ ను ఆయుధాలు ధరించిన కొందరు వ్యక్తులు చుట్టుముట్టడంతో తో మొదలవుతుంది. వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు ఆ బిల్డింగ్ లో ఉన్నతను ప్రాణాలతో కావాలని, అతనితో చాలా జాగ్రత్త గా ఉండాలని హెచ్చరికలు చేస్తుంటాడు. శివరాజ్ కుమార్ బిల్డింగ్ లో కూర్చుని పాని పూరి స్టైల్ లో ఆల్కహాల్ పూరి తింటూ వీరి కోసం ఎదురు చూస్తుంటాడు. ఆయుధాలతో చుట్టు ముట్టి కదిలితే కాల్చేస్తాం అని వార్నింగ్ ఇవ్వగానే, శివరాజ్ కుమార్ తన చేతిలోని మందు గ్లాస్ వెనుకనున్న కవర్ మీద వేసి సిగరెట్ ను విసిరేస్తాడు. వెంటనే మరో సిగరెట్ వెలిగించే లోగా వెనకనున్న కవర్ కాలిపోయి బిగ్ డాడీ రివీల్ అవుతుంది. అది ఒక భారీ యుద్ధ టాంకర్. అది చూశాక శివరాజ్ కుమార్ ను పట్టుకోడానికి వచ్చిన వారికి నోట మాట రాదు. చివరగా, ” మీరు గన్ను తో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్ళతో భయపెట్టాను. దే కాల్ మీ ఓ జీ… ఒరిజినల్ గ్యాంగ్ స్టర్” అనే పవర్ ఫుల్  డైలాగ్ తో ముగుస్తుంది.

శివన్న తన టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో సూపర్ స్వాగ్ తో ఆకట్టుకున్నారు. అర్జున్ జన్య అందించిన పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఫిల్మ్ కి తగ్గ లైటింగ్ మూడ్ ను అందించిన సినిమాటోగ్రాఫర్ మహేష్ సింహా పనితనం ఆకట్టుకుంటుంది. బిగ్ డాడీ గా ఏకంగా వార్ టాంకర్ నే తెచ్చిన దర్శకుడు శ్రీని విజన్ ను మెచ్చుకోకుండా ఉండలేం. తను ఘోస్ట్ ను ఎంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడో ఈ టీజర్ చూస్తే అర్థమైపోతుంది. నిర్మాత సందేశ్ నాగరాజ్ అత్యంత భారీ వ్యయంతో ఘోస్ట్ ను టెక్నికల్ గా టాప్ లెవెల్ లో నిర్మిస్తున్నారు.

Latest Articles

ఆడపిల్లలూ.. బూచోళ్లున్నారు జాగ్రత్త..!

మనుషుల మధ్య మృగాలు తిరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారులు, మైనర్లు అని కూడా చూడకుండా తెగబడుతున్నాయి. మనిషి తోలు కప్పుకుని మృగంలా ఆడవాళ్ల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్