మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ తప్పదని ఆ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన అరెస్టు అయినా బెయిల్ పై బయటకు వస్తారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కేసులో అవినాశ్ ను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదన్నారు. కోర్టుల్లో అవినాశ్ పాత్ర ఉందని రుజువైతే రాజీనామా చేస్తానని మరోసారి స్పష్టం చేశారు.
కాగా కడపలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో వైసీపీ ముఖ్యనేతలతో అవినాశ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌తో రెడ్డి పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తే పార్టీ పరంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.