రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ ఏది చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. అటు బిజినెస్ లైఫ్ లోనూ, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ ఆయన తన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. అత్యంత సంపన్నుడైన ముఖేశ్ తన వ్యక్తిగత సిబ్బందిని ఎంతో ప్రేమతో చూసుకుంటారు. ఆయన డ్రైవర్, ఇంటి పనిమనిషి జీతాలు లక్షల్లో ఉంటాయని ఈ మధ్య వార్తలు వచ్చాయి.
తాజాగా తనకు కుడి భుజంలా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి చాలా ఖరీదైన బహుమతి ఇచ్చారు. కొన్ని సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా తన దగ్గర పనిచేస్తున్న మనోజ్ మోదీ కోసం రూ.1500కోట్ల విలువ చేసే భారీ భవంతని కొనుగోలు చేశారు. ముంబైలోని అత్యంత ఖరీదైన నేపియన్ సీ రోడ్ మలబార్ హిల్ ప్రాంతంలో 22అంతస్తుల ‘బృందావన్’ అనే భవనాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు.
కాగా ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న మనోజ్ మోదీ పలు బిలియన్ డాలర్ల ఒప్పందాలు చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు.