నీటి కోసం ఆతిషి నిరాహార దీక్ష… క్షీణించిన ఆరోగ్యం

దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్‌ మంత్రి ఆతిషి ఆరోగ్యం అదర్ధరాత్రి క్షీణించింది. దీంతో ఆప్‌ నేత సంజయ్ సింగ్, ఇతర నేతలు, కార్యకర్తలు ఆమెను లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ కి తరలించారు. ఆతిషి రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ పడిపోయి 36కు చేరాయని మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ఆతిషి ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే ఆస్పత్రికి తరలించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని వైద్యులు తెలియజేయడంతో, తాము ఆమెను ఆస్పత్రిలో చేర్చామని ఎంపీ సంజయ్‌ సింగ్‌ అన్నారు. ఆతిషి ఢిల్లీ ప్రజల కోసం పోరాడుతున్నారని చెప్పారు. ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి నీరు అందేలా చూడాలని జూన్ 21 నుంచి జలమండలి మంత్రి ఆతిషి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జూన్ 21న ఉపవాస దీక్షకు ముందు ఆమె బరువు 65.8 కిలోలు. నిరాహార దీక్ష నాలుగో రోజుకు ఆమె బరువు 63.6 కిలోలకు తగ్గింది. నాలుగు రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయి 28 యూనిట్లు తగ్గింది. రక్తపోటు స్థాయి కూడా తగ్గింది. ఇది ప్రమాదకరమని వైద్యులు చెప్పడంతో ఆమెను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు.

Latest Articles

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్