29.2 C
Hyderabad
Friday, December 6, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

ఈ ఆర్థిక సంవ‌త్సరంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2 లక్షల 70 వేల‌ ఇళ్లు మంజూరు చేయాల‌ని కేంద్ర గృహ‌నిర్మాణ‌ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్‌కు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పేద‌లకు వారి సొంత స్థలాల్లో 25 ల‌క్షల ఇళ్లు నిర్మించాల‌ని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింద‌ని కేంద్రమంత్రి దృష్టికి రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు. కేంద్రమంత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో క‌లిశారు.

వైద్యమంత్రికి చంద్రబాబు సూచన

వైద్య ఆరోగ్య శాఖ‌లో సేవ‌లు మ‌రింత మెరుగుప‌రిచి, మంచిపేరు తేవాల‌ని సీఎం చంద్రబాబు చెప్పార‌ని వైద్య, ఆరోగ్యశాఖ‌ మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ తెలిపారు. డ‌యేరియా, సీజ‌న‌ల్ వ్యాధులు, కీట‌క జ‌నిత వ్యాధుల‌పై స‌చివాల‌యం నుండి డీఎంహెచ్‌ఓలు, డీసీహెచ్‌ఎస్‌లు, జీజీహెచ్‌ల సూప‌రింటెండెంట్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేయా లన్నారు.

అర్హులకు ఇళ్లు

అర్హులకు డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లు అందిస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమ కొండలోని కుడా ఆఫీసులో మేయర్ సుధారాణి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ రాధిక గుప్తాలతో రాజేందర్‌ సమావేశమయ్యారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను కేటాయించారు.

అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే

ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధ వరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కృష్ణారావు పర్యటించారు. జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసులో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. బోయిన్‌పల్లి చెరువులోని గుర్రపుడెక్క తొలగించాలని కమిషనర్‌కు లేఖ రాస్తానని చెప్పారు.

డయేరియాపై అవగాహన సదస్సు

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో డయేరియా వ్యాధిపై కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అవగాహన సదస్సు నిర్వ హించారు. జిల్లాలో అధిక వర్షపాతం శుభపరిణామం అన్నారు. అయితే.. డయేరియా వ్యాధి సమస్య వచ్చే అవకాశం ఉందని కలెక్టర్‌ చెప్పారు. అన్ని జిల్లాల్లో కన్నా అతి తక్కువ డయేరియా కేసులు అనంతపురం జిల్లాలో నమోదయ్యాయని అన్నారు.

పత్తికొండలో సుమన్

కర్నూలు జిల్లా పత్తికొండలో ఎద్దుల కాటన్ వస్త్ర దుకాణానికి నటుడు సుమన్ ప్రారంభోత్సవం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం కావడం సంతో షంగా ఉందన్నారు. ఏపీలోనూ మినీ ఫిలింసిటీ పెట్టాలని, సినిమా షూటింగ్‌లు చేయాలన్నారు. సుమన్‌ను చూసేందుకు జనం భారీగా వచ్చారు.

పోలీసులు తనిఖీలు

ములుగులోని నూక శివ శంకర్‌ అనే వ్యక్తి కిరణ షాపులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈనేపథ్యంలోనే కిరణ షాపులో పోలీసులకు నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్లను పట్టుబడ్డాయి. నిషేధిత గుట్కా, అంబర్‌ ప్యాకెట్ల విలువ లక్షా 50 వేల రూపాయలు ఉంటుందని చెప్పారు. అనంతరం సొత్తును, నేరస్తుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. లోకల్ పెట్రోలింగ్ చేస్తుండగా పక్కా సమాచారం తో సాంబశివ కిరణ షాపులో తనిఖీ నిర్వహించామన్నారు.

Latest Articles

ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ భారీగా సంబురాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి సంవత్సర కాలం పూర్తి కావస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ఇప్పటికే హస్తం పార్టీ సంబరాలు జరుపుకుంటోంది. పదేళ్ల తర్వాత మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్