ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాళ, రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హంద్రీనీవా బ్రాంచి కాలువను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం బహిరంగసభలో పాల్గొంటారు.రేపు ఉదయం ఆర్ అండ్‌బీ అతిథిగృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. సాయంత్రం పీఈఎస్ ఆడిటోరియంలో తెదేపా శ్రేణులతో నిర్వహించే సమావేశంలో చంద్రబాబు మాట్లాడనున్నారు. కుప్పం చేరుకున్న సీఎంకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.