కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం సిద్ధరామయ్య గురువారం తన అధికారిక నివాసంలో మంత్రివర్గ సభ్యులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఆయన త్వరలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఫోటోల్లో సిద్ధరామయ్య, శివకుమార్‌ను ఆలింగనం చేసుకుంటూ కనిపించారు. మరో ఫోటోలో శివకుమార్, సిద్ధరామయ్య పాదాలు తాకి ఆశీర్వాదాలు తీసుకుంటున్నట్లు కనిపించారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని, ఆ స్థానంలో డీకే శివకుమార్‌ను బాధ్యతలు చేపట్టేలా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సిద్ధరామయ్య పాదాలకు మొక్కిన డీకే శివకుమార్
0
45
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


