లిక్కర్ స్కాంలో విచారణ నిమిత్తం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెళ్లారు. ఆయన వెంట పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఉన్నారు. అంతకుముందు తన నివాసం నుంచి సీబీఐ ఆఫీసుకు బయలుదేరిన కేజ్రీవాల్.. మార్గమధ్యలో రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మగాంధీకి నివాళులర్పించారు. సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు కేజ్రీవాల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తాను అవినీతిపరుడిని అయితే ప్రపంచంలో మరెవరూ నిజాయితీపరులు ఉండరని తెలిపారు. దేశాన్ని ప్రేమిస్తా.. అవసరమైతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తా అని పేర్కొన్నారు. సీబీఐ 100సార్లు విచారణకు పిలిచినా వెళ్తానని కేజ్రీవాల్ స్పష్టంచేశారు.