మంత్రుల పిఏల మీద ఆరోపణలు సహజమని..ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీ రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైసిపి నేతలు మంత్రుల పిఏల విషయంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. లోటు బడ్జెట్ ఉన్నా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. నూతన పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని.. పేదవాడి జీవనప్రమాణాలను పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు.
సోమవారం నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని.. ఈ పర్యటనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు.