ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 24 వరకు జగన్ 1.0 ప్రభుత్వం నడిచిందన్నారు. ఆ టైంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన నడిచిందని చెప్పారు. లంచాలకు తావు లేకుండా 2.71 లక్షల కోట్లు డీబీటీ చేశామని తెలిపారు. కోవిడ్ వల్ల ఆదాయం తగ్గినా హామీలు అమలు చేశామని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని తెలిపారు. బాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయని జగన్ అన్నారు.
మన హయాంలోని పథకాలన్నీ రద్దు చేశారు- జగన్
0
309
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


