సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు వైసీపీ అధికార ప్రతినిది శ్యామల. వారసులు అంటే కుమారుడే కానక్కర్లేదని అభిప్రాయపడ్డారామె. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని వ్యాఖ్యానించారు. చిరంజీవి చేసిన కామెంట్లతో సినిమా చూడబోమంటూ చాలా మంది అంటున్నారని తెలిపారామె. ఇక, ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు శ్యామల. విద్యార్థులకు ఇచ్చే పథకాలను ఆపేసి కూటమి ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధి మళ్లీ జగన్‌తోనే సాధ్యమన్నారు శ్యామల.
చిరంజీవి ఏమన్నారంటే..
మంగళవారం నాడు బ్రహ్మా ఆనందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆ ఈవెంట్లో రామ్‍చరణ్ కూతురు క్లీంకారతోపాటు తన ఇతర మనవరాళ్లతో చిరంజీవి ఉన్న ఫొటోను స్క్రీన్ మీద చూపించారు. ఆ ఫొటోను చూపిస్తూ యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు చిరంజీవి ఈ కామెంట్స్ చేశారు. కామెడీ సినిమా ఈవెంట్ అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. మనవరాళ్లతో తన ఇళ్లు ఓ లేడీస్ హాస్టల్‌లా ఉందని, తాను వార్డెన్‌లా మారానని నవ్వుతూ చెప్పారు. ఫ్లో కంటిన్యూ చేస్తూ.. రాంచరణ్‌కు కూతురు పుట్టిందని, మళ్లీ కూతురు పుడుతుందేమోనని భయపడుతున్నానని అన్నారు. అంతటితో ఆగకుండా రాంచరణ్‌కు కొడుకు పుట్టాలని తనకు కోరికగా ఉందని చిరంజీవి చెప్పారు. చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగపిల్లాడు కూడా లేడని .. వారసత్వం కోసం మగపిల్లాడిని కనాలని రామ్‍చరణ్‍కు సలహా ఇచ్చానని చెప్పారు.
తమ కుటుంబం వారసత్వం కోసం అబ్బాయిని కనాలని రామ్‍చరణ్‍కు చెప్పానని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంకో ఆడబిడ్డని కంటాడేమోని భయం అన్న మాటపై విమర్శలు వస్తున్నాయి. ఈ కాలంలో కూడా మగపిల్లలే వారసులు అని చిరంజీవి స్థాయి లాంటి వ్యక్తి అనడం సరి కాదని, ఆడపిల్లలు వారసులు కాదా అని సోషల్ మీడియాలో చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు. చిరంజీవి లంటి సెలబ్రిటీలో పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అంటున్నారు.
మనవరాలు కూడా చిరంజీవి వారసత్వాన్ని కొనగించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు.. అపోలో అధినేత మనవరాళ్లను, అశ్వినీదత్ కూతుళ్లను ఉదాహరణగా చూపిస్తున్నారు.