25.8 C
Hyderabad
Thursday, February 26, 2026
spot_img

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. జులై 19న విడుదలై చిన్న సినిమా గా వచ్చి పెద్ద విజయం సాధించింది. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ప్రీమియర్స్ ని 50 రూపాయలకే ప్రత్యేక షోలు వేసి పేక మేడలు సినిమా వైపు చూసే లాగా చేశారు. ప్రీమియర్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న పేక మేడలు జులై 26 నుంచి నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ తరఫున యూఎస్ఏ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. 300 పెడితే గాని సినిమా చూడలేని ఈ రోజుల్లో విడుదలైన రోజు నుంచి 100 రూపాయలకే టికెట్ రేట్లు పెట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలాగా చేశారు. కలెక్షన్స్ కోసం కాకుండా మంచి సినిమాని ప్రేక్షకులు అందరూ చూడాలని తక్కువ రేటుకే టికెట్ రేట్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా కాబట్టి ఆడవారు అందరూ ఈ సినిమా చూసే విధంగా ఈ రేట్లు పెట్టినట్టుగా చెబుతున్నారు టీం.

ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ ‘‘మొదటి రోజు నుంచి సినిమా ను ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ₹100 టికెట్ రేట్ పెట్టడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాని చూడగలిగారు. ఇప్పుడు మా సినిమాని నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వారు ఈనెల 26 నుంచి యూఎస్ఏ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఆదరించినట్టే యూఎస్ఏ లో ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.

నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్

టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
పి ఆర్ ఓ: మధు VR

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్