Actors Sidharth Malhotra, Kiara Advani get married: అది లేనట్టే! అంటున్నారు…తెలిసిన వారందరూ…ఏమిటి? ఏమిటి? అని కంగారు పడుతున్నారా? అబ్బే ఏం లేదండీ…కొత్తగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాల పెళ్లి సందడి నాలుగు రోజుల ధూంధామ్ గా జరిగింది.

రాజస్థాన్ జైసల్మీర్ లోని సూర్యఘడ్ ప్యాలెస్ వీరి వివాహానికి వేదికగా నిలిచింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వచ్చినవారందరిని తీసుకురావడానికి 70 లగ్జరీ కార్లను ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు ఇలా అతిథులను తీసుకువచ్చేందుకు ఈ కార్లు నిరంతరం తిరిగాయి.
వీరందరికి విడిది గృహాల్లో ఏర్పాట్లు ఘనంగా చేశారు. అలా వచ్చినవారందరికీ ఎప్పుడేం కావాలో అందివ్వడానికి సుమారు 500మంది వెయిటర్లను ఏర్పాటు చేశారు. వీరిని ఢిల్లీ, ముంబాయి లాంటి మెట్రో పాలిటన్ సిటీస్ లోని ప్రముఖ స్టార్ హోటళ్ల నుంచి రప్పించారు. ఎక్కడా ఎవరికీ నొప్పి కలగకుండా, వారి మనసులు బాధ పడకుండా వీరంతా చూసుకున్నారు.
ఎవరేం అడిగితే అది చిటికెలో వచ్చేలా ఏర్పాటు చేశారు. అయితే ఇంత హంగామా చేసిన తర్వాత…అందరూ అడిగే ప్రశ్న ఏమిటంటే…
‘పెళ్లయ్యింది…మరి ప్రేమ విందు ఎప్పుడు?’ అని… ఇప్పుడు కొత్త జంట ఆ విషయంలో నోరు విప్పడం లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్లు కొత్త ప్రాజెక్టుల్లో బిజీబిజీగా ఉన్నారు. వారి కెరీర్ ప్రణాళికల్లో భాగంగా కొన్నాళ్లూ దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు సమాచారం.

వీరిద్దరూ సింధు, పంజాబీలు కాబట్టి, వారి వారి సంప్రదాయాల ప్రకారం కొన్ని పూజలు చేయాల్సినవి ఉన్నాయంట.అలాగే వీరి వివాహ ఆచారాల ప్రకారం కూడా హానీమూన్ కి వెంటనే వెళ్లరంట. ఈ మధ్యలో వారి వారి ప్రాంతాల్లో అక్కడ ఉన్న బంధువులకి రిసెప్షన్లు రెండు చోట్ల ఏర్పాటు చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇక ముచ్చటగా మూడోది…ముంబయిలో తమ సినీ సెలబ్రిటీస్ మధ్య చేసుకోవాలని అనుకుంటున్నారు.
ఈ కార్యక్రమానికి కత్రినా కైఫ్, షాహిద్ కపూర్, రామ్ చరణ్, మీరా రాజ్ పుత్, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కూడా హాజరవుతున్నట్టు సమాచారం.

ఇక సిద్ధార్థ్ వెబ్ సిరీస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ లో నటిస్తున్నారు. దీనిని రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. అలాగే కియారాకు కూడా బాధ్యతలు ఉన్నాయి. ఇద్దరూ వర్క్ కమిట్మెంట్లు పూర్తి చేసుకున్న తర్వాతే హానీమూన్ ప్లాన్ చేసుకుంటు న్నారని అంటున్నారు. ఇటీవల కొత్తగా పెళ్లయిన క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి జంట కూడా హానీమూన్ కు దూరంగా ఉన్నారని తెలిసింది.