స్వతంత్ర, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ చొరవతో అచ్చంపేట అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు మంత్రి హరీష్ రావు. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం బిఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తుందని అన్నారు. గతంలో అచ్చంపేట నియోజకవర్గంలో కరెంటు కష్టాలు ఉండేవని.. ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంటును కేసీఆర్ సర్కారు అందిస్తోందన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్నామని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఏడాదికి రెండు పంటలు పండించుకునే విధంగా సాగునీరు అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి.. ప్రజలకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వ్యాఖ్యానించారు.
అచ్చంపేట అన్ని రంగాల్లో దూసుకుపోతుంది: హరీష్ రావు
0
309
Previous article
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


