దేవాదాయశాఖపై సమీక్ష నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. సెక్రటేరియట్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ప్రగతి, వైటిడిఎ ఆధ్వర్యంలో యాదాద్రి దేవాలయ పురోగతికి చేపడుతున్న కార్యక్రమాలు,.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, పలు దేవాలయాల్లో సౌకర్యాల కల్పనపై చర్చించారు సురేఖ. ఈ సందర్భంగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా దేవాలయాల ప్రగతి పనులు చేపట్టాలని ఆమె సూచించారు. ఆలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా.. చారిత్రక ఆనవాళ్ళు దెబ్బతినకుండా చూసుకోవాలన్నారు.