ప్రధాని మోదీతో ముచ్చటించిన ఏపీ విధ్యార్థులు.. బహుమతిగా ఏమి ఇచ్చారంటే?

PM Modi |విజ్ఞాన యాత్రలో భాగంగా రాష్ట్రంలోని కొంతమంది ఎస్సీ, ఎస్టీ పాఠశాల విద్యార్ధులు ఢిల్లీ సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ వివరాలను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున(Merugu Nagarjuna) వెల్లడించారు. దిల్లీ వెళ్లిన విద్యార్ధులతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించి వారికి కొన్ని పుస్తకాలు కూడా బహుమతిగా ఇచ్చారని తెలిపారు. అంతే కాకుండా ప్రధాని మోదీని కలిసిన విద్యార్ధులు చాలా ఆనందాన్ని వ్యక్త పరిచారని తెలిపారు. విద్యార్థులు భారత ప్రధానిని కలవటం నిజంగా ఆ విద్యార్ధులు చేసుకున్న అదృష్టం అని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ సామాజిక బాధ్యతా నిధులతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో ఈ యాత్ర ఏర్పాటు చేసిందని.. కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలోని ప్రతిభా వంతులైన 42 మంది బాల, బాలికలను ఎంపిక చేసి ఈ విజ్ఞాన యాత్రకు వెళ్లినట్లు తెలిపారు.

ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో మోదీ(PM Modi)ని కలిసి కొంచెంసేపు మాట్లాడినట్లు వివరించారు. విద్యార్థులకు.. స్వాతంత్ర సమర యోధుల జీవిత చరిత్రలకు సంబంధించిన కొన్ని పుస్తకాలు, స్వామి వివేకానంద వంటి మహనీయుల జీవిత గాథలు చదివి వాటి ద్వారా స్ఫూర్తిని పొందాలని ప్రధాని మోదీ చెప్పాడని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా జన్ ధన్ ఖాతాలను ప్రారంభించి వాటి ద్వారా మీరు సంపాదించిన దానిని పొదుపుచేయాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలిపారు. పరీక్షలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాలను కూడా బహూమతిగా ఇచ్చినట్లు నాగార్జున తెలిపారు.

Read Also: 129 రోజుల తరువాత 1000కి పైగా కొత్త కేసులు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్