Vijayawada |రహదారిపై బైఠాయించిన అంగన్వాడీలు.. అక్కడ తీవ్ర ఉద్రిక్తత..

Vijayawada |తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఈ కార్యక్రమానికి పిలుపునివ్వగా.. విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పలు జిల్లాల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు విజయవాడకు బయలుదేరారు. మరోవైపు పోలీసులు జిల్లాల్లోనే అంగన్‌వాడీ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.

బస్టాండ్, రైల్వే స్టేషన్లలో వారిని అడ్డుకుని విజయవాడ వెళ్లకుండా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా విజయవాడ(Vijayawada) వేదికగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అంగన్వాడీలు విజయవాడ ఏలూరు రోడ్డులోని బీసెంట్ రోడ్డు వద్ద నడిరోడ్డుపై బైఠాయించి తమ నిరసనను కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన అంగన్వాడి కార్యకర్తలని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేసి నిర్బంధించడంతో, పోలీసు తీరుకు నిరసనగా విజయవాడ ఏలూరు రోడ్ లోని బీసెంట్ రోడ్డు వద్ద నడిరోడ్డుపై కూర్చుని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు.

మరోవైపు పోలీసులు పలువురు నాయకులకు నోటీసులు అందజేశారు. ఆందోళనలకు అనుమతి లేనందున చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారుల వెంబడి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు, బిల్లలు సక్రమంగా చెల్లించడం లేదని మండిపడుతున్నారు. తమకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని.. లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు.

 Read Also: నిరుద్యోగుల చావులకు కారణం కేసీఆర్: వై.ఎస్. షర్మిల

Follow us on:   Youtube   Instagram

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్