కొమురం భీం జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే కొమురం భీం ప్రాజెక్టు పరివాహక ప్రాంత రైతులు, ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. ప్రాజెక్టు ఆనకట్ట కుంగి మూడేళ్లు గడుస్తున్నా.. నేటికి మరమ్మతులకు నోచుకోలేదు. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు ఆనకట్ట కుంగిపోయింది. కుంగిపోయిన నాటి నుండి నేటి వరకు ఆనకట్ట పటిష్టత, మట్టి నాణ్యత పరీక్షలపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికే వర్షాకాలం మొదలైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే కట్ట చివరి భాగం కూలిపోయే ప్రమాదం ఉన్నందున.. తూతూ మంత్రంగా అధికారులు పెద్ద టర్పాలిన్ కవర్ కప్పి ఆనకట్టను రక్షిస్తున్నారు.
ఆనకట్ట కుంగి మూడేళ్లు గడుస్తున్నా..
0
23
Latest Articles
చిరు పాతాళ భైరవి ఏమైంది..?
మెగాస్టార్ చిరంజీవితో.. నాగ్ అశ్విన్ పాతాళ భైరవి అనే సినిమా చేయనున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. ఈ మూవీని సుప్రసిద్ద నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్...
- Advertisement -
- Advertisement -


