సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనను అడ్డుకునే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదన్నారు. రేవంత్ బెదిరించేలా వ్యవహ స్తున్నారని .. అభివృద్ధికి అడ్డుపడుతున్నానని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. నమ్మిన సిద్ధాంతం.. నమ్మిన పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. తెలంగాణలో తానే ఉండాలనేది రేవంత్ భావన .. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
రాహుల్‌కి రేవంత్ గులామ్‌లా పని చేస్తున్నారని అన్నారు కిషన్ రెడ్డి. తాను ఎవరి గులామ్‌ను కాదని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎవరు పనిచేస్తున్నారో చర్చిద్దామన్నారు. రేవంత్, మంత్రుల భూదోపిడీతో..తెలంగాణలో భూములు మిగిలే పరిస్థితి లేదన్నారు కిషన్ రెడ్డి.


