హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్లమెంట్ సమీక్ష రసాభాసగా మారింది. నాంపల్లి, కార్వాన్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ ఏర్పడింది. నేతలు ఉస్మాన్ హజరీ, ఫిరోజ్‌ఖాన్ చొక్కాలు పట్టుకున్నారు. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అజారుద్దీన్ పక్కన కూర్చొనే విషయంలో ఇదంతా జరిగినట్టు తెలుస్తోంది. ఉస్మాన్ హజారీ.. ఫిరోజ్‌ఖాన్ చెంపపై కొట్టారు. ఇక ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఫిరోజ్‌ఖాన్ కిందపడిపోయారు. ఇదే సమయంలో ఇద్దరినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు వీహెచ్. వీహెచ్‌ను కూడా తోసేసే ప్రయత్నం చేయడంతో అక్కడున్న నేతలు అడ్డుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమక్షంలోనే ఇదంతా జరిగింది.
గాంధీభవన్‌లో పార్లమెంట్ సమీక్ష రసాభాస.. ఫిరోజ్‌ఖాన్ చెంపపై కొట్టిన ఉస్మాన్ హజారీ
0
5
Previous article
Latest Articles
మోదీని కలిసిన విజయ్… తమిళనాడు సమస్యలపై వినతిపత్రం
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. ఈ నెల ప్రారంభంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత...
- Advertisement -
- Advertisement -


