బెంగళూరు .. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నాలుగు రోజుల క్రితం వచ్చిన 28 ఏళ్ల ఉగాండా మహిళను ముందుజాగ్రత్త చర్యగా ఇందిరా నగర్ అంటువ్యాధుల ఆసుపత్రిలో ఐసోలేట్ చేశారు. ఎబోలా పరీక్ష కోసం ఆమె నమూనాలను సేకరించారు. ఆ మహిళలో జ్వరం వంటి స్పష్టమైన లక్షణాలేవీ కనిపించలేదని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే తెలిపారు. . ఆమె లక్షణాల గురించి తమకు ఇంకా స్పష్టత లేదని… విమానాశ్రయ ఆరోగ్య సంస్థ అలసట వంటి కొన్ని లక్షణాలను గమనించి, నమూనా తీసుకోవాలని నిర్ణయించిందన్నారు. పరీక్షల కోసం నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఉగాండా నుంచి వచ్చిన ఆ మహిళ మొదట ఒక హోటల్‌లో బస చేశారు. అయితే ఒళ్లు నొప్పుల వంటి తేలికపాటి లక్షణాలు కనిపించడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఆఫ్రికన్ దేశాలనుంచే వచ్చే ప్రయాణీకులపై ఓ కన్ను వేసి వుంచాలని ఆరోగ్య శాఖ అధికారులు అన్ని విమానాశ్రయ సిబ్బందిని హెచ్చరించారు. ప్రజలు అంతగా భయపడాల్సిన పని లేదని , దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న కధనాలను నమ్మవద్దని ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది.
బెంగళూరులో ఎబోలా కలవరం… ఉగాండా మహిళ ఐసోలేట్
0
32
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


