సెంట్రల్ రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ స్టాళ్లలో అమ్మే ఆహార పదార్థాల ధరను సవరించింది. జూన్ 1 నుంచి అన్ని స్టేషన్లలో కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. తాజా సవరణ ప్రకారం 50 గ్రాముల ఆలూ వడ ధరను రూ.15గా నిర్ణయించారు. వడతో పాటు తీసుకునే ఒక పావ్ ధరను రూ.5గా నిర్ణయించారు. ఇక వెజ్ సమోసా, వెజ్ పఫ్, సబూదానా వడ ఒక్కోటి రూ.20 గా ధర నిర్ణయించారు, పావ్ భాజీ ధరను రూ.50గా సవరించారు. వెజ్ పిజ్జా కూడా రూ.50లకు లభిస్తుంది. దక్షిణ భారతీయ వంటకాల విభాగంలో మసాలా దోస ధర రూ.35, సాంబార్, చట్నీతో కలిపి రెండు ఇడ్లీలు రూ.30కి అందుబాటులో ఉంటాయి.
సెంట్రల్ రైల్వే స్టేషన్లలో వడా పావ్, సమోసా, దోస, ఇడ్లీ ధరలు పెరిగాయ్
0
109
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


