గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి అంశాన్ని వైసీపీ నేతలు కుల రాజకీయంగా మారుస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. అంబటి మురళి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల అధికారంలో వైసీపీ నాయకులు ఏం చేశారని ధూళిపాళ్ల ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయడమే వైసీపీ పాలనా విధానమా? అని నిలదీశారు. బోండా ఉమా కారుపై చేసిందెవరు? తోట చంద్రయ్యను చంపింది ఎవరు? అని నరేంద్ర నిలదీశారు. సంఘం డెయిరీకి తాను కాపలాదారు మాత్రమే అని, డెయిరీలో అన్ని పార్టీల వారు ఉన్నారని ధూళిపాళ్ల వివరించారు. టీడీపీ ఎప్పుడూ సిద్ధాంతపరమైన పోరాటాలు మాత్రమే చేస్తుందని ఆయన చెప్పారు.
మామిళ్ళపల్లి అంశాన్ని వైసీపీ నేతలు కుల రాజకీయంగా మారుస్తున్నారు- ధూళిపాళ్ల
0
5
Previous article
Latest Articles
ధాన్యం కొనుగోళ్లపై ఉత్తమ్ మాటమార్చారు- హరీశ్‌రావు
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ మాటమార్చారని మాజీ మంత్రి హరీష్‌రావు ఫైరయ్యారు. 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పి..
ఇప్పుడు 70 లక్షల మెట్రిక్ టన్నులే కొంటామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై...
- Advertisement -
- Advertisement -


