దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. తెలంగాణలో వడదెబ్బతో నిన్న ఒక్కరోజే 51 మంది మృతి చెందారు. గత మూడు రోజుల్లో వడదెబ్బతో 107 మంది మృతి చెందారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న 23 మంది మరణించారు. 32 జిల్లాల్లో 40 నుండి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. భద్రాద్రి, జగిత్యాల, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, కొమురం భీం జిల్లాల్లో 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 27వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో వడదెబ్బతో 107 మంది మృతి
0
47
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


