కోయంబత్తూరులో పదేళ్ల బాలిక హత్య.. స్పందించిన సీఎం విజయ్‌

తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. గురువారం నుంచి అదృశ్యమైన పదేళ్ల బాలిక మృతదేహం సూలూరు కన్నయపాలెం సరస్సు వద్ద లభించింది. బాలికను కిడ్నాప్‌ చేసి ఆతర్వాత హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలిక మృతదేహంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సూలూరులోని తన ఇంటికి సమీపంలో కిరాణా షాపుకు వెళ్లిన సమయంలో బాలికను ఎత్తుకెళ్లి హత్య చేసినట్టు పోలీసులు చెప్పారు. నిందితులను కార్తీక్‌, మోహన్‌ రాజ్‌గా గుర్తించారు.

బాధిత బాలిక తల్లిదండ్రులు, బంధువులు సూలూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన సీఎం విజయ్‌.. ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను షాక్‌కు గురి చేసిందని.. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇటువంటి అమానవీయ, క్షమించరాని నేరం చేసే క్రిమినల్స్‌ను సమాజంలో ఉండేందుకు అర్హత లేదని ఎక్స్‌ వేదికగా తెలిపారు.

Latest Articles

కేన్స్ లో నీలి రంగు గౌనులో మెరిసిన ఐశ్వర్య

కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మరోసారి తన అందచందాలతో అందరిని ఆకర్షించారు అందాల నటి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌. ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూసిన ఆమె ఫస్ట్ లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. నీలిరంగు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్