BREAKING
సీఎన్‌జీ ధరలను మరోసారి పెంచిన కేంద్రం
కిలో సీఎన్‌జీపై రూపాయి పెంచిన కేంద్రం
రెండు రోజుల వ్యవధిలో సీఎన్‌జీ ధరలను రెండుసార్లు పెంచిన కేంద్రం
రెండు రోజుల క్రితమే కిలో సీఎన్‌జీపై రూ.2 పెంచిన కేంద్రం
తాజా పెంపుతో ఢిల్లీలో రూ.80.09కి చేరిన కిలో సీఎన్‌జీ
దేశంలో సీఎన్‌జీ ధరలు మరోసారి పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం కిలో సీఎన్‌జీపై మరో రూ.1 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులపై అదనపు భారం పడనుంది.
ఇప్పటికే రెండు రోజుల క్రితం కిలో సీఎన్‌జీపై రూ.2 పెంచిన కేంద్రం.. తాజాగా మరోసారి ధరలు పెంచడంతో వరుసగా రెండోసారి పెంపు జరిగినట్లైంది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.80.09కు చేరుకుంది.
ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో రవాణా ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సీఎన్‌జీ ఆధారిత ఆటోలు, క్యాబ్‌లు, వాణిజ్య వాహనాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.


