పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. బండి భగీరథ్‌ను శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.
ముందస్తు బెయిలుకు, అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టులో భగీరథ్‌కు ఉపశమనం లభించని నేపథ్యంలో ఆయన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్లు రాత్రి 8 గంటల సమయంలో బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భగీరథ్‌ను అరెస్టు చేశామంటూ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. పోలీస్ అకాడమీ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని, నేరుగా పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు.
అరెస్టును ప్రకటించాక భగీరథ్‌కు తొలుత స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మేడ్చల్‌లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. భగీరథ్‌ను పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో చర్లపల్లి జైలుకు తరలించారు.


