ఫార్ములా ఈ కారు రేసు కేసు.. విచారణకు బీఎల్‌ఎన్‌ రెడ్డి డుమ్మా

తెలంగాణలో ఫార్ములా ఈ కారు రేసు కేసు సంచలనంగా మారింది. ఈకేసులో ఏసీబీ ఇప్పటికే దర్యాప్తు చేస్తుండగా ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. బీఆర్ఎస్‌ హయాంలో HMDA చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేసిన బీఎల్‌ఎన్‌ రెడ్డిని గురువారం విచారణకు పిలిచింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరారు. విచారణకు హాజరుకావడానికి..మరికొంత సమయం కావాలని బీఎల్‌ఎన్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌కు BLN రెడ్డి ఈ-మెయిల్ పంపించారు. దీనిపై ఈడీ అధికారులు సానుకూలంగా స్పందించారు. మరో రోజు విచారణకు పిలుస్తామని చెప్పారు.

ఈకేసులో దర్యాప్తు చేసిన ఏసీబీ ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, ఏ3గా బీఎల్‌ఎన్‌ రెడ్డిని చేర్చింది. కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు స్వల్ప ఊరట లభించింది. అరెస్టు చేయొద్దంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు దాన కిషోర్‌ను ఏసీబీ అధికారులు విచారించి.. ఆయన స్టేట్‌ మెంట్‌ రికార్డు చేశారు.

 

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్