తెలంగాణలో ఫార్ములా ఈ కారు రేసు కేసు సంచలనంగా మారింది. ఈకేసులో ఏసీబీ ఇప్పటికే దర్యాప్తు చేస్తుండగా ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ హయాంలో HMDA చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన బీఎల్‌ఎన్ రెడ్డిని గురువారం విచారణకు పిలిచింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరారు. విచారణకు హాజరుకావడానికి..మరికొంత సమయం కావాలని బీఎల్‌ఎన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు BLN రెడ్డి ఈ-మెయిల్ పంపించారు. దీనిపై ఈడీ అధికారులు సానుకూలంగా స్పందించారు. మరో రోజు విచారణకు పిలుస్తామని చెప్పారు.
ఈకేసులో దర్యాప్తు చేసిన ఏసీబీ ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్‌ఎన్ రెడ్డిని చేర్చింది. కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు స్వల్ప ఊరట లభించింది. అరెస్టు చేయొద్దంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు దాన కిషోర్‌ను ఏసీబీ అధికారులు విచారించి.. ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేశారు.