ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఒకే వేదికపై కనిపించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. పల్నాడు జిల్లాలో పర్యటించనున్న వీరిద్దరూ.. నరసరావుపేట మండలం కాకాని జేఎన్‌టీయూ కశాళాలలో నిర్వహిస్తోన్న వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ వేర్వేరు హెలిక్యాప్టర్లలో జేఎన్‌టీయూకు చేరుకోనున్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటనున్నారు. అనంతరం JNTU కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వీరిద్దరి టూర్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. వనం – మనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
నేడు నరసరావుపేటకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్
0
211
Previous article
Latest Articles
కోదాడలో కల్తీ పాలు, పెరుగు వ్యాపారం.. స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ బాగోతం
కోదాడలో కల్తీ పాలు, పెరుగు వ్యాపారం కలకలం రేపింది. పాలలో కెమికల్స్, గమ్ము, మిల్క్ పౌడర్ మిక్సింగ్ చేస్తూ కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో అక్రమార్కుల బాగోతం బయటపడింది....
- Advertisement -
- Advertisement -


