రూటు మార్చిన క్రేజీ బ్యూటీ..

ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎలా టర్న్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసినా.. ఊహించని విధంగా మళ్లీ స్టార్ట్ అవుతుంటుంది. ఎప్పుడూ ఊహించని క్రేజీ ఆఫర్స్ వస్తుంటాయి. ఏంటి.. నమ్మడం లేదా.. ఓ హీరోయిన్ విషయంలో ఇప్పుడు అలాగే జరిగింది. మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోదామని ఎంగేజ్ మెంట్ కూడా చేసేసుకుంటే.. మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింది.. క్రేజీ ఆఫర్స్ తో కెరీర్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. రూటు మార్చి దూసుకెళుతుంది. ఇంతకీ.. ఎవరా హీరోయిన్..? ఆ బ్యూటీకి వచ్చిన క్రేజీ ఆఫర్స్ ఏంటి..?

ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే.. ఆఫర్స్ వస్తుంటాయి. అలాగే ఒకటి లేదా రెండు సినిమాలు ఫ్లాపులు అయినా.. కాస్త గ్యాప్ వచ్చినా.. ఫౌడౌట్ అయిపోయారని డిసైడ్ చేసేస్తారు. అలాంటిది ఓ బ్యూటీ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఆతర్వాత కూడా ఆఫర్స్ దక్కించుకుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు.. నివేథా పేతురాజ్. ఊహించని విధంగా మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడంతో.. మళ్లీ యాక్టింగ్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అంతే కాదండోయ్.. కెరీర్ అయిపోయింది అనే టాక్ వినిపిస్తున్న ఈ టైమ్ లో క్రేజీ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.

చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో.. సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో బ్రేక్ అయితే రాలేదు. రీసెంట్ గా లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సింగ్ గీతం సినిమాలో ఆమె ఒక చిన్న క్యామియో రోల్ లో కనిపించింది. దీంతో ఆల్మోస్ట్ ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయిందా అనేలా కామెంట్స్ వచ్చాయి. కానీ ఆమె ప్లానింగ్ వేరేలా ఉంది. వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న ఆదర్శ కుటుంబం సినిమాలో నివేథా ఒక క్రేజీ ఛాన్స్ దక్కించుకుని అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది.

వెంకటేష్ సినిమా ఛాన్స్ తోనే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన నివేథా.. ఇప్పుడు ఏకంగా మరో మెగా ఆఫర్ కూడా తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న మూవీలో నటిస్తుంది. ఈ సినిమాలో నటించడం అంటే లక్ అనే చెప్పాలి. మంచి ఆఫర్స్ కోసం చూస్తున్న నివేథాకు ఇప్పుడు బాగా కలిసొచ్చింది. హీరోయిన్ గానే చేయాలి అనే రూల్ పెట్టుకోకుండా కీలకమైన పాత్రలకు సైతం ఓకే అంటుండడంతో.. మంచి ఆఫర్స్ దక్కించుకుంటుంది. దీంతో.. వెంకీ ఆదర్శ కుటుంబం, మెగా 158 రిలీజ్ అయితే.. నివేథాకు మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది.

Latest Articles

అనిల్ రావిపూడి.. ప్రయోగం చేయబోతున్నారా..?

హిట్ మిషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అనిల్ రావిపూడి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్