ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విరుచుకుపడ్డారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు ఉన్న విలువలు కూడా రేవంత్ రెడ్డికి లేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు సిగ్గుపడే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఇంకా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ” పాలకులు తోటమాలితో సమానం. రేవంత్ రెడ్డి సీఎం అనే టైటిల్ తీసివేసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని మార్చుకోవాలి. ఫ్యూచర్ సిటీ పేరుతో బెదిరించి ప్రయివేటు భూములు లాక్కుంటున్నారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు ఏం గడ్డి పీకుతున్నారు? హిల్ట్ పాలసీపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాము. ఎవరి జాగీరు అని రేవంత్ రెడ్డి భూములు అమ్ముతున్నారు. పేదవాళ్ళు బంజారాహిల్స్ లో ఉండవద్దా…? ఏసీబీ ఆఫీసు ముందు ఉన్న భూమిని వేలానికి పెట్టారు. రేవంత్ రెడ్డిని ప్రజా కోర్టులో శిక్షించాలి. ప్రజా పాలన కాదు ప్రజా దోపిడీ పాలన. హిల్ట్ పాలసీ దేశంలో అతి పెద్ద భూ కుంభకోణం. రేవంత్ రెడ్డి ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారు. సీఎం అంటే కమీషన్ మినిస్టర్. రేవంత్ రెడ్డి పాపంలో క్యాబినెట్ లో ఉన్న అందరికి వాటా ఉంది. హిల్ట్ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోంది హిల్ట్ పాలసీ పేరుతో కంపెనీలను వేరే ప్రాంతాలకు తరలించే కుట్ర జరుగుతోంది. హిల్ట్ పేరుతో 6 లక్షల కోట్ల రూపాయల దందా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమైనా ఫత్వాలు జారీ చేస్తున్నారా…? గతంలో ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్ళిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది”…అని అన్నారు.
రేవంత్‌పై దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు
0
11
Previous article
Latest Articles
ఎన్టీఆర్ ప్రాజెక్ట్.. సూర్యతో సెట్ అయ్యిందా..?
ఒకరి కోసం కథ రాస్తే.. మరోకరితో సెట్ అవుతుండడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అందుకనే.. కథ ఎవరికి రాసి పెట్టి ఉంటే.. వారితోనే సెట్ అవుతుంది అంటుంటారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్...
- Advertisement -
- Advertisement -


