వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యల పై మండిపడిన వైఎస్ షర్మిల

ఢిల్లీలో తమ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు రాలేదన్న ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై ఏపీసీసీ చీఫ్‌ షర్మిల ఘాటుగా స్పందించారు. ఎక్స్‌ వేదికగా ఆమె వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. ‘మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? మీ పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? విభజన హక్కులు, ప్రత్యేక హోదాను ఐదేళ్ల పాటు గాలికి వదిలేసినందుకా? అని షర్మిల నిలదీశారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంటే మీరు సంఘీభావం ప్రకటించారా? మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది’ అని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జై కొట్టారు కదా? అని షర్మిల విమర్శించారు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా? ఇప్పుడు కలిసి పోరాడదాం అంటున్నారు? అని షర్మిల ఎద్దేవా చేశారు.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్