విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తా అన్నారు. కేసీఆర్ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలపై బీహెచ్‌ఈ ఎల్ ప్రతినిధులని కూడా వివరాలు అడుగుతామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునపరిశీలన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తామన్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తా- జస్టిస్ నరసింహారెడ్డి
0
362
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


