యువత సమస్యలు పరిష్కారం కావాలంటే యువత క్రియాశీలక రాజకీయాల్లో రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో NSUI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, బిఆర్‌ఎస్ రెండు పార్టీలు కూడా ఒక్కటేన న్నారు. విద్యార్థులకు మెరుగైన ఉచిత విద్య కావాలన్నా, రిజర్వేషన్లు కావాల న్నా పెద్దపల్లి పార్లమెంట్ యువ నాయకుడు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత పదేళ్లుగా తెలంగాణను పాలించిన బిఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,దళిత బంధుని ఇస్తామని చెప్పిన కేసీఆర్, ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని అభ్యర్థి వంశీకృష్ణ ప్రశ్నించారు.
యువత క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలి – బల్మూరి వెంకట్
0
315
Previous article
Latest Articles
జగన్‌కు మంత్రి లోకేష్ సవాల్
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్నానని..
డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్తానని అన్నారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్...
- Advertisement -
- Advertisement -


