యువత సమస్యలు పరిష్కారం కావాలంటే యువత క్రియాశీలక రాజకీయాల్లో రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో NSUI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, బిఆర్‌ఎస్ రెండు పార్టీలు కూడా ఒక్కటేన న్నారు. విద్యార్థులకు మెరుగైన ఉచిత విద్య కావాలన్నా, రిజర్వేషన్లు కావాల న్నా పెద్దపల్లి పార్లమెంట్ యువ నాయకుడు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత పదేళ్లుగా తెలంగాణను పాలించిన బిఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,దళిత బంధుని ఇస్తామని చెప్పిన కేసీఆర్, ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని అభ్యర్థి వంశీకృష్ణ ప్రశ్నించారు.
యువత క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలి – బల్మూరి వెంకట్
0
313
Previous article
Latest Articles
మోహన్ నాయక్ కు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా,...
- Advertisement -
- Advertisement -


