వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను 14 సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పార్ల మెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, అందుబాటులో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 14 నుంచి వచ్చే నెల 11 వరకు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ఇంటింటికీ తిరుగుతూ ప్రచార పత్రాలతో క్యాంపెయిన్ నిర్వహిస్తారు.
నియోజకవర్గాల వారీగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్న రేవంత్.. మరికాసేపట్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు. మొదటి సారి సీఎం హోదాలో రాజ్‌గాపాల్ రెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లనున్నారు. అక్కడ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశమ వుతారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంకి సన్నిహితుడు కావడంతో భువనగిరి గెలుపుపై స్పెషల్ ఫోకస్ చేశారు రేవంత్.


