రసవత్తరంగా ప్రకాశం జిల్లా చీరాల రాజకీయం

ప్రకాశం జిల్లా చీరాల రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. తన సొంత నియోజకవర్గం చీరాల టికెట్ నిరాకరించి పర్చూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమించడంతో ఆమంచి వైసీపీని వీడారు. దీంతో ఎన్నికల వేళ ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యం లో తాజాగా అనుచరులతో భేటీ అయిన ఆమంచి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు ఆమంచి. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేసేందుకు ఆమంచి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇక్కడి నుంచి టీడీపీ-జనసేన-బీజేపీ ఆధ్వర్యం లోని కూటమి తరఫున ఎం.ఎం. కొండ య్య, వైసీపీ నుంచి కరణం వెంకటేశ్‌ను ఆ పార్టీలు అభ్యర్థులుగా ప్రకటించాయి. దాంతో త్రిముఖ పోటీ ఉండే అవకా శం ఉంది. చీరాల వైసీపీ టికెట్‌ దక్కకపోవటంతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలవాలని కొంతకాలం నుంచి కృష్ణమోహన్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీలోనే ఉంటూ ఆయన చీరాల టికెట్‌ కోసం పట్టుబ డుతూవచ్చారు. అయితే అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కరణం బలరాం ఉన్నారు. గత ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ఆయన టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం వైసీపీలో చేరి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. దీంతో వైసీపీ అధిష్ఠానం ఆయనకు బదులు తనయుడు వెంకటేశ్‌కు అవకాశం కల్పించింది. టిక్కెట్‌ దక్కక ఆమంచి వైసీపీపై అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్